వెంకటాపురం శివారులో ఇసుక లారి ఢీకొని ఒకరి దుర్మరణం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం శివారు వీరాపురం గ్రామం శివారులో సల్లూరు గోపాలరావు (40) సం. లారీ ఢీకొని మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలరావు రహదారిపై నడుచుకుంటూ వస్తుండగా వెనక నుండి వస్తున్న ఇసుక లారీ డీ కొనగా గోపాలరావు శరీర భాగాలు చిద్రమయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో జరిగింది .లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా రోడ్డు పక్కనుంచి నడిచి వెళ్తున్న సల్లూరు గోపాలరావును ఢీకొట్టడంతో గ్రామస్తులందరూ అప్రమత్తమై లారీని నిలుపుదల చేశారు. ఈ ప్రమాద సంఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.