పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలంలోని మేడారం ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తాడ్వాయి తహ సిల్దార్ గిరిబాబు శుక్రవారం తనిఖీ చేశారు. అదేవిధంగా ఊరట్టం, మేడారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని, కూరగాయలను, మంచినీటి వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో పాటు భోజనం చేసి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నా రు.విద్యార్థులకు మెనూలో ఉన్న విధంగా అందించకుంటే వార్డెన్లపై తగిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న విద్యార్థులు తమ కు ఫిర్యాదులు చేయమని పేర్కొన్నారు.