జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 3.33 కోట్ల నిధులు మంజూరు

Written by telangana jyothi

Published on:

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 3.33 కోట్ల నిధులు మంజూరు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు 3 కోట్ల 33 లక్షలు నిధులు మంజూరయ్యా యి. ఆయా నిధులతో అంతర్గత రోడ్డు సౌకర్యం లేని గ్రామా లను గుర్తించి, వివిధ గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు నిధులను వినియోగించాలని ఉత్తర్వులలో పేర్కొన్నా రు. ఈ మేరకు మెటీరియల్ కాంపొనెంటు కింద సి.సి రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆయా వీధులు, గ్రామాలలో అంచనాలు నిధులు టెక్నికల్ అంశాలతో వర్క్ ఆర్డర్లను మంజూరు చేశారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు సన్నహాలు ప్రారంభించారు. ఈ మేరకు భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ లు,ఇతర అదికారులు వెంకటాపురం, వాజేడు మండలాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమా లు నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వెంకటాపురంలోని డబల్ బెడ్ రూమ్ గృహాల వద్ద శంకుస్థా పన శిలాపలకంతో పాటు,రామాలయం వీధిసమీపంలో మరో శంకుస్థాపన శిలాఫలకం, వాజేడు మండలంలోని మంజూరైన గ్రామాలలో నిర్మాణ పనులను చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అదికారులు, శంకుస్థాపన శిలాఫలకాల నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ చేతుల మీదుగా శనివారం శంకు స్థాపన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆగమేగాలపై శంకు స్థాపన కార్యక్రమం పనులను వేగవంతం చేశారు. వాజేడు మండలంలో 14 పైగా రోడ్ల నిర్మానానికి  ఎంజిఎన్ఆర్ఇజి ఎస్ నిధులు, అలాగే వెంకటాపురం మండలం లో సుమారు 15 పైగా సిమెంట్ రోడ్లు ఇతర అభివృద్ధి పథకాలు చేపట్టేం దుకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రత్యేక కృషితో నియోజకవర్గానికి చివరిగా ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాల పై ప్రత్యేక దృష్టి సారించి, నిధులు మంజూరుకు కృషి చేయడం పట్ల రెండు మండలాల ప్రజలు, గిరిజనులు గిరిజన సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భద్రా చలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం, జిల్లా కలెక్టర్లు అభివృద్ధి పను లకు శంకుస్థాపన కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు మండల తహసిల్దార్ లక్ష్మీరాజయ్య, పంచాయతీ రాజ్ డి.ఇ ఇంతియాజ్, ఏ ఈ ప్రభు చరణ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హు స్సేన్ , కాంగ్రేస్ నేతలు చిడెం సాంశివరావు , రమేష్ ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా సమావేశమై శనివారం జరిగే ఎంఎల్ఏ పర్యటన అంశాలపై చర్చించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now