Bangkok flight | బ్యాంకాక్ కు చౌకగా విమానయానం
హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ప్రయాణమని వెల్లడించిన ఎయిన్ఏసియా
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఏషియా వెల్లడించింది. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో థారు ఎయిర్ఎషియా హెడ్ ఆఫ్ కమర్షియల్ తన్సితా అక్రరిత్పిరోమ్ మాట్లాడుతూ.. ఈ సేవలను అక్టోబర్ 27 నుంచి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా వన్ వేలో టికెట్ ధరను రూ.7,390గా నిర్ణయించామన్నారు. అక్టోబర్ 27 నుంచి 2025 మార్చి 29లోగా ప్రయాణించడానికి వీలుగా, ఈ నెల సెప్టెంబర్ 22లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వారంలో నాలుగు విమానాలు అందుబాటులో ఉంటాయన్నారు. అదే విధంగా చెన్నరు నుంచి బ్యాంకాక్కు అక్టోబర్ 30 నుంచి డైరెక్ట్ సేవలను అందించనున్నామన్నారు. తద్వారా దేశంలోని రెండు ముఖ్య నగరాల నుండి ప్రయాణికులు నేరుగా థాయిలాండ్ కు వెళ్లడానికి వీలుంటుందన్నారు.