గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహిం చుకోవాలి
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ ల వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కన్నాయిగూడెం స్థానిక సబ్ ఇన్ఫెక్టర్ వెంకటేష్ అన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జర గకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.గణేష్ నవరా త్రి ఉత్సవాల్లో భాగంగా మండపానికి అనుమితి మొదలుకొని వేడుకల్లో భాగంగా తీసుకునే జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది రాకుండా సామరస్యంగా వ్యవహరించాలన్నారు. ప్రతి గణపతి మండపానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.