పెద్దపల్లి బీజెపీ జిల్లా అధ్యక్షుడిగా చందుపట్ల సునీల్ రెడ్డి
తెలంగాణ జ్యోతి, కాటారం : పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామ్ రెడ్డి తనయుడు మంథని నియోజకవర్గ బీజెపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డికి ఆ పార్టీ నేతలు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయం సాధించాలని ఆశిస్తున్నామని అన్నారు. సునీల్ రెడ్డి ని నియమించిన రాష్ట్ర బిజెపి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాటారం మండలాధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి, కాటారం మండల ప్రధాన కార్యదర్శులు రాజేంద్రప్రసాద్, గంట అంకయ్య, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్, బొంతల రవీందర్, జిల్లెల శ్రీశైలం, మంత్రి సునీల్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు నడిగోట శ్రీవాణి, మెరుగు సౌజన్య తదితరులు పాల్గొన్నారు.