ఘనంగా తెలుగుభాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిది : మండల కేంద్రంలోని ఏటూరునాగారం డిగ్రీ కళాశాల నందు తెలుగు విభాగం ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్క రించుకొని తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం నిర్వహిం చారు. అదేవిధంగా మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్క రించుకొని జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రేణుక మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారికతెలుగు భాషా అందించిన సేవలను కొనియాడుతూ, హాకీ కీరాకారుడైన ధ్యాన్చంద్ హాకీ క్రీడలకు రూపాంతరంగా చెందాడని జాతీయ భారత క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనంద మైన విషయం అని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో తెలుగు భాషా విభాగాధిపతి సంపత్, డా.నవీన్, డా .జ్యోతి, వెంకటయ్య, కనీఫ్ ఫాతిమా, మున్ని, విద్యార్థులు పాల్గొన్నారు.