బస్వాపూర్ లో దొంగల బీభత్సం

బస్వాపూర్ లో దొంగల బీభత్సం

– అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.దంపతులపై దాడి

– రూ.లక్ష నగదు,బంగారం, బైక్ చోరీ.

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేశారు. తమకు అడ్డు తగులుతున్నారని ఇంట్లో భర్త తిరుపతిని కట్టేసి ఆయన భార్య స్వర్ణలత గొంతు కోశారు. ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదు, ఐదు తులాల బంగారం, బైకును అపహ రించారు. తీవ్ర గాయాల పాలైన స్వర్ణలత భూపాలపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉద యం భూపాలపల్లి ఓ ఎస్దీ బోనాల కిషన్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు బస్వాపూర్ గ్రామాన్ని సందర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనతో స్థానికంగా ఆందోళన చోటు చేసుకుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment