ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 48వ జన్మదిన వేడుకలు ఏటూరునాగారం మండలంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ,కాకులమర్రి లక్ష్మీనరసింహారావు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు ఎండి.ఖాజా పాషా గృహంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం పట్టణ అధ్యక్షుడు ఎండి.ఖాజా పాషా, సీనియర్ నాయకులు తుమ్మ.మల్లారెడ్డి, సప్పిడి.రామ నరసయ్య, మాజీ ఎంపీపీ అంతటి.విజయ నాగరాజు, మాజీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి, పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ మాదరి.రామన్న, దన్నపనేని కిరణ్, కుమ్మరి.చంద్రబాబు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బట్టు.రమేష్, షాపెళ్లి గ్రామకమిటీ అధ్యక్షుడు మాదరి. రాంబాబు, కాళ్ల. రామకృష్ణ, కొండాయి.చిన్ని, వావి లాల. ముత్తయ్య, గండేపల్లి.నరసయ్య, శ్రీరాములు, వావి లాల రామనర్సయ్య, వావిలాల.కిషోర్, కుమార్, శ్రీనివాస్ లతోపాటు పార్టీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.