శాంతించిన గోదావరి – క్లియర్ అయినా టేకులగూడెం రహదారి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భారీ వర్షాలు గోదావరి వరదల కారణంగా ఛత్తీస్గడ్, బీజాపూర్, మహారాష్ట్ర తదితర అంతర్రాష్ట్ర రవాణా గత 20 రోజులుగా రాకపోకలు స్తంభించిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి గురువారం నుండి గోదావరి వరద నీరు తగ్గిపోవడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. సుమారు రెండు వారాలకు పైగా వాగు గుండా గోదావరి వరద నీరు చొచ్చుకు వచ్చి ఎన్ హెచ్163 రహదారిని ముంచెత్తి వేయగా వరంగల్, ఏటూరునాగారం వాజేడు మీదుగా ఛత్తీస్గడ్, బీజాపూర్, మహారాష్ట్ర తదితర అంతర్రాష్ట్ర రవాణా వాగు కు ఇరువైపులా కిలోమీటర్ల పొడవున భారీ కంటైనర్లు, లారీలు, ఇతర వాహనాలు రోజుల తరబడి నిలిచిపోయాయి. అయితే గురువారం ఉదయం రెండు అడుగులు పైగా లోతు ఉన్న రహదారి పైనుండి వాహ నాలను అనుమతించారు. సాయంత్రాని కల్లా రహదారిపై పూర్తిగా వరదనీరు తొలగిపోవడంతో అంతర్ రాష్ట్ర రవాణా వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉదయం నుండి రాకపోకలు రధ్ధీగా సాగిస్తున్నాయి. చత్తీస్గడ్ ఇతర ప్రాంతాల నుండి అత్యవసర సమయాల్లో వైద్యశాలలకు, ఆసుపత్రులకు వెళ్ళు పేషెంట్లు వాహనాల రాకపోకలు వరదల కారణంగా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రతి ఏడాది వర్షాకాలం, గోదావరి వరదలు సమయంలో టేకులు గూడెం వద్ద పడవ ను ఏర్పాటు చేయాలని, ఉభయ రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.