బస్సు సౌకర్యం లేక అవస్థలు

Written by telangana jyothi

Published on:

బస్సు సౌకర్యం లేక అవస్థలు

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెవెలుగు బస్సులు పల్లెలకు కాకుండా పట్టణాలకు పరిమిత మవుతున్నాయని, దీంతో పల్లె ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికులకు తప్పని తిప్పలు

గ్రామాల నుంచి ప్రజలు విద్యార్థులు,ములుగు, హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, భద్రాచలం, భద్రాద్రికొత్తగూడెం, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయ్యితే సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పల్లెలకు బస్సు సౌకర్యంలేకపోవడంతో ప్రయాణికులు మ్యాజిక్ ఆటోల కోసం పడిగాపులుకాస్తుంటారు.లేదంటే కాలినడకనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కంతనపల్లి గ్రామ ప్రజలు, 7కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణి స్తున్నమని వాపోతున్నారు.

మ్యాజిక్,ఆటో లే శరణ్యం

గ్రామాలు బాగుండాలాంటి ఆ గ్రామంలో ప్రధానంగా రోడ్డు రవాణా సౌకర్యం ఉండాలి.అంతేకాకుండా ఒక గ్రామానికి మరొక్క గ్రామానికి మధ్య అనుసంధానం చేసేది రావన వ్యవస్థనే, కానీ పాలకులు నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం వల్ల మండలంలోని చాలా గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సౌకర్యం లేక పోవడంతో ప్రయాణికులు మ్యూజిక్,ఆటో లను నమ్ముకొని ప్రయాణించాల్సి వస్తోంది.

బస్సు సౌకర్యం లేని గ్రామాలు

మండలంలోని మొత్తం 11 గ్రామ పంచాయితీలు ఉండగా ఐలాపూర్ ,కంతనపల్లి, సర్వాయి, చిట్యాల, బూపతి పురం, గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కంతనపల్లి, చిట్యాల, బూపతిపురం ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు పోవడం వలన ఎంతో మంది విద్యార్థులకు, ప్రజలకు అనుకూలంగా ఉండేది.

బస్సు సౌకర్యం కల్పించాలి

బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు మ్యాజిక్, ఆటోలలో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, మహిళలు, ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని గ్రామాలకు బస్సును ఏర్పాటు చేయాలని, గతంలో వచ్చే బస్సులను పునరుద్ధరిం చాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Leave a comment