నిజామాబాద్ జిల్లాలో బాలుడు అదృశ్యం
నిజామాబాద్ ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో బాలుడు అదృశ్యమైనట్లు ఒకటో టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం కోటగిరి మండలానికి చెందిన వాగ్మారీ పూజ వ్యవసాయ కూలీ గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. గత నెల 31న రంజాన్ సందర్భంగా తన కుమారుడు, అత్త, మామలతో కలిసి నగరంలోని బోధన్ బస్టాండ్ వద్దకు వచ్చింది. అక్కడ తన అత్త మామలతో తన కుమారుడు సంతోష్ బయటకు వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన బాలుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో చుట్టు పక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. బాలుడి తల్లి వాగ్మారి పూజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా బాలుని ఆచూకి తెలిస్తే 87126 59714, 94410 58289 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.