డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష
– 10 మందికి జరిమానా
నిజామాబాద్ ప్రతినిధి తెలంగాణ జ్యోతి : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందికి ట్రాఫిక్ ఏ.సి.పి టి.నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ఎదుట హాజరు పరచగా 10 మందికి రూ.14,500 జరిమానా విధించి మరో ఐదుగురు వ్యక్తులు కామ్ లే వంశీ, అబ్దుల్ సాజిద్ , రాథోడ్ ఇరమ్మన్, మునిపల్లి ఉదయ్ కిరణ్, అమూల్ జింకన్వాడు లకు రెండు రోజుల జైలుశిక్ష విధించినట్లు సిఐ తెలిపారు.
————————————-
విలేకరులు కావలెను. వివరాలకు 9848552224 నంబర్లో సంప్రదించగలరు.
————————————–