ప్రజలు తప్పని సరిగా పరిసరాలు పరిశుభ్రంగా చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లిప్రతినిధి,తెలంగాణ జ్యోతి: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, విద్యా, పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వానకాలం మొదలై నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలలో సీజనల్ వ్యాధులు, ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలుషిత నీరు, కలిషిత ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా, కామెర్లు వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే అవకాశం ఉందని అన్నారు. డయేరియా సోకిన వ్యక్తులు వాంతులు, వరోచనాలు సంబవిస్తాయని తద్వారా అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా ఆరు శాఖల అధికారులు గ్రామ స్థాయిలో ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలో నీటి కులాయిలు వద్ద నీరు నిలవడం, మంచినీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేం దుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, వర్షుపునీరు నిల్వలు ఉండకుండా దోమలు, ఈగలు ప్రభల కుండా ఫాగింగ్, బ్లీచింగ్ చేయాలని తెలిపారు. నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు వ్యాప్తిని అరికట్టేందుకు ఆయిల్ బాల్స్, గంభూషి యా చేపలు వేయాలని తెలిపారు. గ్రామాలలో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో చదివే పిల్లలకు శుభ్రంగా చేతులు కడుక్కోవడం , మరుగుదొడ్లను వినియోగించడం గురించి అవగాహన కల్పించాలని అంగన్వాడీలలో, పాఠశాలలలో వంటలు వండే వారు పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలలలో నీటి కలుషితమై డయేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని గ్రామస్థాయిలో ఆశ వర్కర్ల ద్వారా డయేరియా సోకిన వ్యక్తులు పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు అలాగే తక్షణమే సమీపంలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలని సూచించారు. ఓఆర్ఎస్, జింకు ట్యాబ్లెట్లు వినియోగం గురించి అవగాహన కల్పించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలిన గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించాలని, పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చే వరకు నిరంతర పర్యవేక్షణ, వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఏదేని సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విషపు జంతువుల బారిన పడిన ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో అన్ని రకాల అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిపిఓ నారాయణరావు, డిఆర్డీఓ నారాయణరావు, సంక్షేమ అధికారి అవంతిక, ఆర్ డబ్ల్యూఎస్ ఈ ఈ నిర్మల, డీఈఓ రాజేందర్, ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.