రంజాన్ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు.

Written by telangana jyothi

Published on:

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు.

ఏటూరునాగారం తెలంగాణ జ్యోతి : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంగపేట మండల కేంద్రానికి చెందిన మైనార్టీ మోర్చ ములుగు జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాష ఇంటికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి వెళ్ళి రంజాన్ వేడుకలో పాల్గొని సంప్రదాయ పద్ధతిలో తేనెటీ విందు స్వీక రించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మైనార్టీ సోదర, సోదరీమణులు మూడవ సారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు కు తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ తక్కల పల్లి దేవెందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ గౌడ్, జిల్లా కార్యదర్శులు పోదెం రవిందర్, కర్ర సాంబశివ రెడ్డి ,గిరిజన మోర్చ జిల్లా అద్యక్షులు గండెపెల్లి సత్యం, శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఏర్రంగారి వీరన్ కుమార్, ఇమ్మడి రాకేష్ యాదవ్, కె.వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment