కార్ ఓనర్స్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షునిగా మంతెన సతీష్
– ఎస్ఐ ని సన్మానించిన యూనియన్ సభ్యులు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కారు ఓనర్లు , డ్రైవర్లు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షునిగా మంతెన సతీష్ ఎన్నిక య్యారు. ఉపాధ్యక్షుడిగా కారెంగల సతీష్ ను ఎన్నుకున్నారు. డ్రైవరు ఓనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్నికైన ప్రతినిధులు అన్నారు. లాంచన పూర్వకంగా కాటారం ఎస్సై మ్యాక అభినవ్ ను పోలీస్ స్టేషన్లో కలిశారు. అనంతరం ఎస్సై అభినవ్ ని శాలువతో యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.