మేడారంలో ఘనంగా బిర్సా ముండా జయంతి
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం ఐ టి డి ఎ పిఓ ఆదేశాల మేరకు బిర్సా ముండా 150 వ జయంతి ఉత్సవాలను శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం ఆశ్రమ పాఠశాల పిల్లలకు చిత్రలేఖ పోటీలను ఏర్పాటు చేశారు. అనంతరం మ్యూజియం అసిస్టెంట్ క్యూ రెటర్ కుర్సం రవి మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు ఆదివాసి అస్తిత్వం జీవన స్థితిగతుల కోసం పోరాటం చేసిన భగవాన్ బీర్సా ముండా జననం 1875 నవంబర్ 15 ఉలిహాట్ రాంచి జార్ఖం డ్ లోజన్మించారన్నారు.వలస వాదంపై తిరుగుబాటు చేశార న్నారు. ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మేడారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చిడం బాబురావు, ఉపాధ్యా యులు, అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షులు సిద్ద బోయిన భోజరావు, శంకర్, రమేష్, మైపతి సంతోష్, మ్యూజియం సిబ్బంది పాల్గొన్నారు.