తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శబరిష్
– రహదారులను ఆక్రమిస్తూ వాహనాలు నిలిపితే కేసులు నమోదు చేయండి
– అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా నిరంతర నిఘా ఉంచాలి
– రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రేడియం టేప్ లను ఎక్కువ మొత్తంలో అమర్చండి
– గంజాయి రవాణా,గుడుంబా తయారీ ని పూర్తి స్తాయిలో అడ్డుకట్ట వేయాలి
– మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి శబరిష్ తనిఖీ చేసా రు. స్టేషన్ లో గల రికార్డ్స్ ను పరిశీలించి కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ సిబ్బం ది యొక్క కిట్ ఆర్టికల్స్, ఆయుధ సామాగ్రిని ని సిబ్బంది యొక్క నైపుణ్యాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ తాడ్వాయి పోలీస్ స్టేషన్ చుట్టు పక్కల పరిసర ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం, బయ్యారం అడవులతో సరిహద్దును కలిగి ఉన్నందున మావోయిస్ట్స్ ల కదలికలపై నిఘా ఉంచాలని. గుత్తి కోయ ప్రజలకు అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియ చేసారు. గంజా యి రవాణా పై దృష్టి సారించాలని ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నందున ప్రజల భద్రత కై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం వారికి వెంటనే రసీదు అందించాలని, ఎఫ్ ఐ ఆర్ నమోదు, కేసుల దర్యాప్తు నిష్పక్ష పాతంగా నిర్వహించాలని ఎస్పీ తెలియజేశారు. అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరనలో గల వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ క్రమశి క్షనతో ఉద్యోగం చేయాలనీ విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసు కుని వాటి పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డి ఎస్పీ రవీందర్,సిఐ పస్రా రవీందర్ ,ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.