ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాటారం, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండల కేంద్రం లోబీజేపీ ఆవిర్భావదినోత్సవo వేడుకలను మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివారం నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ అధ్యక్షతన బీజేపీ గద్దె వద్ద భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాదేవపూర్ ప్రతీ బూతులలో బీజేపీ జెండాను ఎగురవేశారు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 06 తేదీన ఆవిర్బవించి నేటితో 45సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. రానున్న రోజులలో బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని, ప్రజలను బిఆర్ఎస్, కాంగ్రెస్ మాయ మాటలతో నమ్మించి మోసం చేశాయని, 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ తెలంగాణ ను అప్పుల కుప్పగా చేసిందన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో గెద్దె నెక్కి అమలు చేయడంలో అడ్రస్ లేకుండా పోయిందని, ఈ రెండు పార్టీలు ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తు న్నాయన్నారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లో బీజేపీ అధిక మొత్తంలో సిట్లను కైవసం చేసుకొని సత్తా చాటుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బిజెపి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, బీజేపీ నాయకులు ఆడప లక్ష్మీ నారా యణ, కన్నెబోయిన ఐలయ్య, సాగర్ల రవీందర్, పూర్ణచేందర్, రాకేష్, రాజు, సాయి, సంపత్, సంతోష్, హస్సి, చింటూ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.