నూతన చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన
– కాళేశ్వరం ఎస్సై చక్రపాణి
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై చక్రపాణి, ఏఎస్ఐ రాజేశం, సిబ్బంది అలాగే టి ఎస్ ఎస్ పి ఫోర్సు ఆధ్వర్యంలో కాళేశ్వరంలో నూతన చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానితుల వేలిముద్రలను చెకింగ్ నిర్వహించారు. అదేవిధంగా ప్రతిరోజు కాళేశ్వరం గ్రామంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మరియు షాపింగ్ సమీపంలో టెంపుల్ ఏరియాలో గల షాపింగ్ లో చుట్టుపక్కల రాత్రి పగలు సమయంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానితులను గుర్తించి విచారించడం జరుగుతుందన్నారు. అలాగే కాలేశ్వరం గ్రామం నుండి పలుగుల రోడ్డుపై నిలిచి ఉన్న లారీల డ్రైవర్లతో ఎస్సై సమావేశమై వారికి సామాన్య ప్రజలకు ఇబ్బందులను గురి చేయొద్దని వాహనాల పార్కింగ్ క్రమబద్ధంగా పెట్టుకోవాలని లారీ డ్రైవర్లు మరియు ఇసుక క్వారీల నిర్వహకుల తోటి మాట్లాడారు. అలాగే అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీ చేసి అనుమానితులను విచారించడం మరియు వాహనాల పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకుని తప్పకుండా హెల్మెట్ ధరిస్తూ ద్విచక్ర వాహనదారులు ప్రయాణించాలని ఎస్సై వారిని హెచ్చరించారు . అలాగే కాలేశ్వరంలో సైబర్ నేరాల గురించి మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా నిర్వహించారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎస్ఐ లారీ డ్రైవర్లకు టిఎస్ఎండిసి ట్రాఫిక్ రూల్స్ గురించి లారీలు రద్దీగా పోతున్న రోడ్డుమీద నిలవకుండా చూసుకోవాల్సిందిగా హెచ్చరించారు. అదేవిధంగా గ్రామంలోని ప్రజలకు నూతన చట్టాల గురించి వివరిస్తూ ఈ మధ్యకాలంలో జరిగిన నేరాల గురించి ఎలాంటి భయాలకు భయాందోళన గురికాకుండా పోలీస్ త్వరలోనే ఇట్టి నేరాలను చేదిస్తా మంటూ ఎస్ఐ తెలపారు.