అశ్వారావుపేట ఎస్ఐ మృతదేహంతో రాస్తారోకో
నర్సంపేట, తెలంగాణ జ్యోతి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట జాతీయ రహదారిపై ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహంతో బంధువులు, గ్రామస్థులు రాస్తారోకోకు దిగారు. శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. వీరికి మద్దతుగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ఎస్సై శ్రీనివాస్ మృతికి కారణ మైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.