అక్షరాస్యత, పరిసరాల పరిశ్రుభ్రతపై అవగాహన సదస్సు
ములుగు ప్రతినిధి : నాబార్డ్ సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత, పరిసరాల పరిశుభ్రత పై భూపాలనగర్ లో మల్లంపల్లి బ్రాంచి ఆధ్వర్యంలో కళాజాత బృందం ద్వారా బుర్రకథ,జానపద గేయాలు ఆటపాటలతో అవగాహన కార్యక్రమం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సదస్సు కు నాబార్డ్ ఏ జి ఎం రవి చైతన్య హాజరై మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు బ్యాంకు అందించే సేవలు ఉపయోగించుకోవాలి. వ్యవసాయ పంట రుణాలు సంవత్సరం లోపు రెన్యూవల్ చేసుకోవటం ద్వారా వడ్డీ రాయితీ వస్తుంది అని అన్నారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజనలో అర్హత ఉన్న ప్రతి ఖాతా దారులు చేరాలి అని పేర్కొన్నారు. ఖాతాదారుడు సహజ లేదా ప్రమాదం జరిగి మరణించిన 2 లక్షల నుండి 4 లక్షలు భీమా ఉంటుంది. ఖాతాదారులు ఈ అవకాశాలు వినియో గించుకోవాలని, సైబర్ నేరల పై అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరికి ఖాతా, ఏటీఎం, ఓటీపీ, సి పి వి, నెంబర్లు చెప్పవద్దని గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పాటిస్తు రోగాలను దూరం చేయండని స్వచ్ఛత హే సేవ గురించి వివరించారు. ఈ సదస్సులో ఏపీజీవీబీ ఎఫ్ ఎల్ సి కౌన్సిలర్ ఎం ప్రేమ్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్స్ ,ఏ రాజగోపాల్, జి సమంత్, కుమార్, బ్యాంకు మిత్ర వెంకన్న, ఎం.వి కళాజాత విజయ్ బృందం , గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.