చదువుకున్న పాఠశాలలోనే టీచర్ ఉద్యోగం

Written by telangana jyothi

Published on:

చదువుకున్న పాఠశాలలోనే టీచర్ ఉద్యోగం

– అదే పాఠశాలలో చదువు నేర్పిన గురువు వద్దనే సహా టీచరుగా నియామకం. 

– స్వాగతం పలికిన పాఠశాల ఉపాధ్యాయులు.

– అభినందనలు తెలిపిన టీచర్లు వాడ గూడెం బెస్తగూడెం గ్రామస్తులు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : పుట్టి పెరిగిన గ్రామంలో ప్రాథమిక విద్య నేర్చుకున్న పాఠశాలలోనే నూతన టీచరు గా ఉద్యోగం. మరో విశేషమేమంటే తనకు ప్రాథమిక విద్యను నేర్పిన గురువు కూడా అదే పాఠశాలలో టీచర్ గా చేస్తున్నారు. ఇంతటి అరుదైన అదృష్టం కలిసి వచ్చిన విద్యా కుసుమం అయిన జాడి కళ్యాణిని బెస్తగూడెం పాఠశాల ఉపా ధ్యాయులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. వివరాల్లో కెళ్తే… ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం పంచాయతీ వాడ గూడెం గ్రామం కు చెందిన జాడి కళ్యాణి ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే విద్యను అభ్యసించింది. అలాగే ఉన్నత విద్య అంతా పట్టణ ప్రాంతాల్లో చదువుకుంది. 2024 డీఎస్సీ లో ఎస్. జి. టి. ఉపాధ్యాయురాలుగా జాడి కళ్యాణి ఎంపికైంది. ఈ మేరకు బుధవారం ములుగు జిల్లా వెంకటా పురంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తాను ప్రాథమిక విద్యను అభ్యసించిన,మరియు పుట్టి పెరిగి న బెస్తగూడెం వాడగూడెం గ్రామంలోనే ఎస్. జి. టి. ఉపాధ్యా యురాలుగా నియామకం పత్రాలను మండల విద్యాధికారి నుండి స్వీకరించారు. వెంటనే పాఠశాలలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆమె నియామక పత్రాలతో పాఠశాల ప్రాంగ ణంలోకి అడుగుపెట్టిన వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ఆమెకు విధ్య నేర్ఫిన, అదే పాఠశాలలో పని చేస్తున్న ఆమె గురువు కృష్ణారావు తో సహా ఆమెను అభినం దించారు. ఒకప్పుడు శిశ్యు రాలిగా ప్రస్తుతం సహా ఉపా ధ్యాయురాలుగా తాను పనిచేస్తున్న పాఠశాలలోనే టీచ రుగా నియామకం కావడంతో విద్యనేర్ఫిన గురువు క్రిష్ణా రావు ఆనంద భాష్ఫాలతో ఆశీర్వదించి, అభినందనలు తెలిపారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now