గుమ్మల్లపల్లిలో సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కాటారం మండలం గుమ్మల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాటారం ఎస్సై అభినవ్ సీసీ కెమెరాల వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించారు. సీసీ కెమెరాల వల్ల వచ్చే లాభాలు గురించి గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికలో వివరించారు. ఒక సీసీ కెమెరా 100 మంది జవాన్లతో సమానమని అన్నారు. గ్రామా ల్లో జరుగుతున్న దొంగతనాలు గాని, అసాంఘిక కార్యక్ర మాలు గాని సీసీ కెమెరాల వలన తొందరగా దొరికిపోతారని పేర్కొన్నారు. గ్రామస్తులు అందరూ కలిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు.