పోషణ పక్వాడ వారోత్సవాలపై అవగాహన
కాటారం, తెలంగాణ జ్యోతి : పోషకాహార పదార్థాలు చిరు ధాన్యాలతో గర్భిణీలు, చిన్నారులకు మేలు జరుగుతుందని ఐసిడిఎస్ మహాదేవపూర్ సిడిపిఓ రాధిక అన్నారు. మండల స్థాయిలో పోషణ పక్వాడ వారోత్సవాల సమావేశాన్ని మంగళవారం అయ్యప్ప ఫంక్షన్ హాల్లో సిడిపిఓ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో 5 గురు గర్భిణి స్త్రీ ల కి సీమంతం, 6 నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రాసన, 3 సం పిల్లలకి అక్షర భ్యాసం చేయించారు. రక్తహీనత, గర్భిణి స్త్రీ తీసుకోవల్సిన జాగ్రత్తలు,వెయ్యి రోజుల ప్రాముఖ్యత,హ్యాండ్ వాష్ ,అనుబంద ఆహారం, ఐరన్, కాల్షియం మాత్ర ల ప్రాముఖ్యత,ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గ్రుడ్లు తినడం వల్ల పొందే లాభాల గురించి అవగాహన కల్పించారు.గంగారం, కాటారం సెక్టార్ల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు , గర్భిణీలు, బాలింతలు,తల్లులు, కిశోర బాలికలు, పిల్లలు పాల్గొన్నారు. ముఖ్య అతిధులుగా హెల్ప్ డిపార్ట్ మెంట్ నుండి డాక్టర్ మౌనిక , సి హెచ్ ఓ నిర్మల, ఎం పి ఓ రామస్వామి , ఎన్ జి ఓ కో ఆర్డినేటర్ సమ్మయ్య , పోషణ అభియాన్ స్వప్న, సూపర్ వైజర్స్ వీణ, శివరాణి, భాగ్యలక్షి, నాగరాణి , మేడిపల్లి సెక్రెటరీ రాకేష్ లు పాల్గొన్నారు.