అధికారుల పనితీరును గుర్తించి అవార్డుల పురస్కారం
వెంకటాపూర్ : మండలంలోని అధికారులు ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ప్రభుత్వం తరఫున గౌరవంగా అందించే పురస్కార అవార్డులు మండల ఎంపీడీవో మూడు రాజు, ఎన్ఆ ర్ఈజీఎస్ ఏపీవో నారగోని సునీత, లక్ష్మీదేవిపేట పంచాయతీ సెక్రటరీ దుర్గాప్రసాద్, కంప్యూ టర్ ఆపరేటర్లు నరేందర్, దశరథ్, వెంకటాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ పోలోజు రామాచారిలకు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచా యతీరాజ్ ,గ్రామీణ అభివృద్ధి ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. అవార్డు పొందిన అధికా రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవార్డు పొందిన ఆ శాఖ అధికారులు, సిబ్బంది, పుర ప్రము ఖులు శుభాకాంక్షలు తెలిపారు.