లక్ష్మీదేవి పేట గ్రామపంచాయతీ కార్యదర్శికి అవార్డు
వెంకటాపూర్, తెలంగాణజ్యోతి : లక్ష్మీదేవిపేట గ్రామానికి ఉత్తమ పని తీరు కనబరిచినందుకు ప్రభుత్వం తరఫున గౌరవించే అరుదైన పురస్కారాన్ని వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి తాళ్లపల్లి దుర్గాప్రసాద్ కు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ చేతుల మీదుగా లక్ష్మీదేవిపేట పంచాయతీ కార్యదర్శి దుర్గప్రసాద్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. తనకు అవార్డు మూడోసారి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవార్డు పొందిన దుర్గప్రసాద్ కు ఆశాఖ అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.