కాలుష్యాన్ని నివారించండి ఎలక్ట్రికల్ వాహనాలు వాడండి
– ఎలక్ట్రికల్ వెహికల్ వాడడం వల్ల నిర్వహణ ఖర్చులు తక్కువ శబ్ద ,వాయు, కాలుష్యం నివారించవచ్చు
– ఎస్ హెచ్ ఓ చల్ల రాజు, వావ్ ఇకో మోటర్ కంపెనీ డైరెక్టర్ లక్ష్మణ్
వెంకటాపూర్ : ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం ద్వారా కాలు ష్యాన్ని నివారించాలని ఎస్ హెచ్ ఓ చల్ల రాజు, వావ్ ఈకో మోటర్ కంపెనీ డైరెక్టర్ లక్ష్మణ్ లు అన్నారు. ఆదివారం సాయంత్రం వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామ సమీపంలో గల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిసరాలలో వావ్ ఇకో మోటార్ బైక్ సక్సెస్ మీట్, ఫ్రీస్కూటీ అచీవర్స్ కార్యక్రమంలో భాగంగా కేతిరి రాధిక – బిక్షపతి లను సన్మానించి స్కూటీని అందించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఎస్ ఐ ఓ చల్ల రాజు, వావ్ ఈకో మోటార్స్ డైరెక్టర్ లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. ఇంధనం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి దీని ఫలితంగా భారత దేశంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగగా, ఎలక్ట్రికల్ వెహికల్ వాడటం వలన నిర్వహణతో ఖర్చులు తగ్గుతాయ న్నారు. శబ్ద, వాయు కాలుష్యము తగ్గించవచ్చని, ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ వంటి ఎలక్ట్రిక్ వాహనాలు డబ్బు ఆదా చేస్తాయని అన్నారు.డబ్బు ఆదా చేయాలనుకునే వ్యక్తులకు ఇది ఆర్థిక భరోసానిస్తుందని అన్నారు. ఖర్చు పొదుపు, ప్రయో జనాలు, పర్యావరణ స్థిరత్వంపై పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ఆర్థికంగా, ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బండి శీను, వావ్ ఈకో మోటా ర్స్ అప్లై నర్స్ పాషా, సంజీవ్, ములుగు భూపాలపల్లి సీనియ ర్ అప్లైనర్స్ చిర్ర గణేష్,కేశవులు, గంధం లక్ష్మణ్ కవిత, రమేష్ ,వంశీ, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.