పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా ఆదర్శ నగర్ కాలనీ షటిల్ టీం రక్త దానం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: పోలీస్ అమరుల దినోత్సవం సందర్బంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పి కిరణ్ ఖరే పిలుపు మేరకు కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో ఆదర్శ నగర్ కాలనీ షటిల్ టీం రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య అమరులు అయిన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బం గా కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య మాట్లాడు తూ దేశ, రాష్ట్ర శాంతిభద్రతల విషయంలో పోలీసులదీ కీలక పాత్రని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ విధులను నిర్వహిస్తారని అన్నారు.యువ పోలీసులు అమరులయిన పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. రక్త దానం అనేది ప్రాణ దానం అని అన్నారు. పేషంట్లకు అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉంటే ఎట్టి పరిస్థితులలో అయి న రక్త దానం చేసి ప్రాణాన్ని నిలబెట్టవచ్చన్నారు. ఈ సంద ర్బంగా మాట్లాడారు. ఈ సందర్బంగా రక్త దానము చేసిన వారిలో కాటారం మాజీ ఎంపీపీ పంతకని సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, భూపెల్లి రాజు, కొండగొర్ల రాంనా రాయణ, ఆత్మకూరి కుమార్, మరుపాక రాజేంద్ర ప్రసాద్, గూడెపు సురేందర్ పంతకాని వినయ్ తదితరులు పాల్గో న్నారు. రక్త దానం చేసిన సభ్యులను కాటారం డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి, సీఐ నాగార్జున రావు, ఎస్ఐ అభినవ్ ప్రత్యే కంగా అభినందించారు.