బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని రద్దు చేయాలి.
– 5 న ఆందోళనకు కార్యక్రమాలకు పిలుపునిచ్చిన వామపక్ష పార్టీలు
తెలంగాణ జ్యోతి , భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : కేంద్రం లో బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేయడాన్ని వెంటనే విరమించుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య లు డిమాండ్ చేశారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కొమురయ్య భవన్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు గనుల ప్రైవేటు కరణ, బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని కోరారు. దేశంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే 60 సింగరేణి బ్లాకులను వేలం వేయడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోశ్రావనపల్లి ఓసి ని వేలం వేయడానికి సిద్ధపడిందని ప్రైవేటీకరణ సింగరేణి మనుగడకు గొడ్డలి పేట్ లాంటిదని అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేకమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. ఉత్తర తెలంగాణకే గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బొగ్గు గనుల ప్రైవేటు కరణ చేయనని చెప్పిన బిజెపి ప్రభుత్వం అత్యంత స్పీడుగా గనులను వేలం వేయడానికి సిద్ధపడిందని వివరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న ప్రైవేటీకరణ అడ్డుకోవడం లేదని విమర్శించారు. జులై 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిం చాలని వాపక్షాల రాష్ట్ర కమిటీలు పిలుపునివ్వడం జరిగింద న్నారు. జులై 5వ తేదీన పెద్ద ఎత్తున అంబేద్కర్ సెంటర్ వద్ద వాపక్ష పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి కార్మిక వర్గం వాపక్ష శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో వాపక్ష పార్టీ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల ఆజోసెఫ్, శ్రీకాంత్, పీక రవికాంత్ ఆరబోయిన వెంకటేష్ గోనాల తిరుపతి, సిపిఎం పార్టీ నాయకులు అధరాజయ్య నాయకులు ఆకుదారి రమేష్, గడప శేఖర్,రాజు తదితరలు పాల్గొన్నారు.