జులై 4న జరిగే విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :జులై 4న జరిగే విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక రావి నారా యణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ మాట్లాడుతూ జులై 4వ తారీఖున కేజీ టు పీజీ విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని కోరారు. నెట్, నీట్ పరీక్షలు రాసి, నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనుక తీసుకోవాలని, టిఐఎస్ఎస్ ముంబై, ఐఐటీ ముంబై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, యూనివర్సిటీలలో స్వేచ్ఛ వ్యక్తీకరణ ప్రజాస్వామ్య అంచివేత చర్యలను ఆపాలని, పాఠశాలల మూసివేతను ఆపేయాలని, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 4న జరిగే విద్యాసంస్థల బంద్ లో విద్యార్థులు తల్లిదండ్రులు మేధావు లు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాతంగి దిలీప్, ఇందారపు అరవింద్, విష్ణు, చల్లూరి రక్షిత, రేవెల్లి రాధిక తదితరులు పాల్గొన్నారు.