పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
– ఎంపీడీవో అడ్డూరి బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: పరిసరాలు పరిశు భ్రంగా ఉంచుకోవాలని కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని పలు వీధులలో స్వచ్ఛతాహి కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని, ప్రజలందరూ అర్థం చేసుకొని సహకరించాలని ఆయన కోరారు. ఈ సంద ర్భంగా మురుగునీటి గుంతలు, నిల్వ ఉన్న నీటిని పార బోశారు. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య సిబ్బంది చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎం పీ ఓ వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి షఘీర్ ఖాన్, ఏఎన్ఎం శ్యామలత, అంగన్వాడీ టీచర్ సుశీల, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.