రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ దివాకర
ములుగు ప్రతినిధి : జిల్లాలోని రైతులు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని, మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా ఏవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతుకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, ఆదార్ కార్డు, నామినీ ఆధార్ కార్డుతో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగి జూన్ 28, 2024లోపు పాసుపుస్తకాలు జారీ చేయబడిన రైతులు అర్హులన్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో నమోదు చేసుకున్న రైతులు మాత్రం ఏవైనా మార్పులు ఉంటే సంబంధిత ఏఈవోలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.