ఐటిఐలలో ప్రైవేటు పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
కాటారం, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ ,ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థలయందు పనిచేయుచున్న అర్హత కలిగిన అభ్యర్థులకు వివిధ ట్రేడ్లయందు ఏఐటిటి జూలై2025కి ప్రైవేట్ అభ్యర్ధిగా ఐ.టి.ఐ పరీక్షలు రాయుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సంబందిత ట్రేడ్ నందు అభ్యర్థులు 3 సంవత్స రముల పైబడి సర్వీస్ కలిగి ఉండి నైపుణ్యం కలిగినట్లుగా సంబంధిత సంస్థ ద్వారా సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ,ఎంప్లాయ్ గుర్తింపు కార్డు సమర్పించి ప్రాంతీయ ఉప సంచాలకులు (అప్రింటిన్షిప్), ప్రాంతీయ కార్యాలయం ములుగురోడ్డు, వరంగ ల్ నందు, రూ.100/- రుసుము చెల్లించి దరఖాస్తు పొందాలి. ఐ.టి.ఐ. పాస్ అయిన అభ్యర్థులు ఐ.టి.ఐ. నందు సి ఓ ఈ పాస్ అయిన అభ్యర్ధులు, ఎస్సివిటి అభ్యర్థులు 2018 వరకు అడ్మిషన్ పొందినవారు, ఇతర అభ్యర్థులు ఎస్ సి వి టి నందు 2019 నుండి అడ్మిషన్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వచ్చు. ఏడవ తేదీ నుండి దరఖాస్తులు ప్రారంభంగా 14వ తేదీతో గడువు ముగుస్తుంది. పూర్తి వివరములకు ప్రాంతీయ ఉపసంచాలకులు (ఎప్రింటీన్షిప్),ప్రాంతీయ కార్యాలయం ములు గు రోడ్డు, వరంగల్ నందు సంప్రదించాలన్నారు.