అంగన్వాడి కేంద్రాలలో పోషణ వారోత్సవాలు

అంగన్వాడి కేంద్రాలలో పోషణ వారోత్సవాలు

అంగన్వాడి కేంద్రాలలో పోషణ వారోత్సవాలు

కాటారం, తెలంగాణజ్యోతి: మండలంలోని అంగన్వాడీ కేంద్రా లలో మంగళవారం నుండి పోషణ పక్వాడలో కార్యక్రమంలో భాగంగా పిల్లలకు, గర్భిణీ మహిళలకు, బాలింతలకు పలు కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భవతుల యొక్క బరువు, మొదటి 1000రోజుల ప్రాముఖ్యతను, 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణ, గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు కుటుంబ సభ్యులతో చర్చించి భర్తకు అవగాహన కల్పించారు. 2 సంవత్సరంల లోపు పిల్లలకు 80 శాతం మెదడు అభివృద్ధి జరుగుతుందని, ఆ వయసులో పిల్లలకు ఏది నేర్పించిన త్వరగా వస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. గంగారం సెక్టర్ లోని అల్లీపూర్ అంగన్ వాడి కేంద్రంలో ముస్కుల శ్రీలత రెడ్డి, కాటారం పంచాయతీ పరిధిలోని ప్రతాపగిరి, నస్తూరుపల్లి, మేడిపల్లి, బయ్యారం-2, చిధ్నేపెళ్లి, గుమ్మల్లపెళ్లి-1, గుమ్మల్ల పల్లి-2, పోతులవాయి,సుందర్రాజుపేట-1అంగన్వాడి సెంటర్లలో పోషణ పక్వాడ వారోత్సవాలు నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment