అప్రెంటిషిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
ములుగు, తెలంగాణ జ్యోతి : ఇంటర్ ఒకేషనల్ పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి అప్రెంటిషిప్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ములుగు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ నోడల్ అధికారి పి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2021, 2022, 2023 సంవత్సరాలలో ఎమ్మెల్టీ ఎమ్ పిహెచ్ డబ్ల్యు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు ములుగు ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలని, దరఖాస్తులకు జనవరి 20 2024 చివరి తేదీ అని పేర్కొన్నారు.
1 thought on “అప్రెంటిషిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం”