ఆస్పిరేషనల్ బ్లాక్ మూడు నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి

Written by telangana jyothi

Published on:

ఆస్పిరేషనల్ బ్లాక్ మూడు నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి

– జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ.

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : అస్పిరేషనల్   బ్లాక్ కన్నాయిగూడెం మండలానికి మూడు నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అస్పిరేషనల్ బ్లాక్ కన్నాయిగూడెం మండల వైద్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పిరేషనల్ బ్లాక్ కన్నాయిగూడెం మండలానికి సంబంధించి మూడు నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి వారం రివ్యూ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్ఎంపి రిజిస్టర్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. వర్షాకాలం దృష్టి లో ఉంచుకొని గ్రామపంచాయతీ కార్యదర్శులు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, గ్రామాలలో మిషన్ భగీరథ సర్వే రేపటి వరకు పూర్తిచేయాలని,అంగన్వాడీ సూపర్ సూపర్వైజర్ లు, సీడీపీవో ల ఆధ్వర్యంలో గ్రామాల్లో పోషక ఆహారం, మాత శిశు సంరక్షణ పై విస్తృత అవగాహన కల్పిస్తూ వారికి పౌష్టిక ఆహారం అందించాలని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారు సూచించిన గ్రామపంచాయతీ ప్రొఫైల్ ఫార్మాట్ ఖచ్చితమైన సమాచారంతో పూర్తిస్థాయిలో తయారుచేసి నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు.కన్నాయిగూడెం మండలంలోని గంగుగూడెం , గుట్టల గంగారం గ్రామాలలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణా లు పాటిస్తూ త్వరితగతిన వేగంగా పనులను పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద జరుగుతున్నా సాండ్ బ్యాగ్స్ ఫిల్లింగ్ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ ప్రోగ్రాం ఆఫీసర్, కన్నాయి గూడెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ అభినవ్, డాక్టర్ ఉషారాణి, హెల్త్ సూపర్వైజర్లు ఏఎన్ఎం ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment