ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆటో – నలుగురికి తీవ్రగాయాలు
తెలంగాణ జ్యోతి, వాజేడు : ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనగా నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పూసుర్ బ్రిడ్జిపై జరిగింది. ఏటూర్ నాగారం నుండి వెంకటాపురం వెళుతున్న ఆటోను పూసూరు బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికీ ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను 108 సహాయంతో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.