మేడారం భక్తులకు బస్ స్టేషన్ ఎదురుగా చలివేంద్రం.
– ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం వెంకటాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని బుధవారం భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మేడారం వెళ్లే ,వచ్చే భక్తులకు పార్టీ పరంగా మంచినీటి సేవలు అందించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు పని చేయాలని, ఈ సందర్భంగా చలివేంద్ర ఏర్పాటు చేయడం పట్ల పార్టీ నాయకత్వాన్ని ఆయన అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మేడారం శ్రీ సమ్మక్క సారక్క మహా జాతరకు వెళ్లి, వచ్చే భక్తుల కొరకు వెంకటాపురం మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చల్లటి మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించడం అబినందనీయం అన్నారు. మేడారం వన దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మేడారం భక్తులు ఈ చలివేంద్రం సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్.ఐ. ఆర్.అశోక్ , బిఆర్ఎస్ సీనియర్ జిల్లా నాయకులు గుడవర్తి నరసింహమూర్తి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంపా రాంబాబు , ప్రధాన కార్యదర్శి పిల్లారీ సెట్టి మురళి, అధికార ప్రతినిధి డర్ర దామోదర్, సీనియర్ నాయకులు వేల్పూరి లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు చిడేం రవికుమార్, ముడుంబా శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు పెనుమత్స మాధురి, మాజీ అధ్యక్షురాలు జానకమ్మ, మాజీ సర్పంచ్ నారాయణమ్మ, మాంతయ్య, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.