పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్

Written by telangana jyothi

Published on:

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్

– తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం

తెలంగాణ జ్యోతి, కాటారం : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ లో అంకిత్ గోయల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి, సిపి రామగుండం, ఐజి, ఏం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయి స్టుల కదలికలు, సరిహాద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి, ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా మావోయిస్టు లను కట్టడి చేయడం సులభతర మవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణం లో నిర్వహించవచ్చని సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. మెదటగా రామగుండం పోలీస్ కమీషనర్ , భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పి , మంచిర్యాల డీసీపీ రామగుండం నుండి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లి సమావేశం కి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశం లో అధికారులు మాట్లాడుతూ మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషిచేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు, మూడు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించాలని, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ల విషయం లో మూడు రాష్ట్రాల పోలీసులు ఒకరి ఒకరు సహకరించుకోవాలని, సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాల కట్టడి, కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకుందామని కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇరురాష్ట్రాల అధికారులు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమావే శంలో ఐ పీ ఎస్ అధికారులు, సీపీ రామగుండం ఎం శ్రీనివాస్, గడ్చిరోలి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, గడ్చిరోలి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (Ops), CRPF, జగదీష్ ఎన్. మీనా, డి, నీలోత్పల్. IPS, SP, గడ్చిరోలి, కిరణ్ ఖరే, IPS, ఎస్పీ భూపాలపల్లి , నిఖిల్ పింగళే, IPS, ఎస్పీ గోండియా, కిరణ్ ఖరే, IPS, K. సురేష్ కుమార్, IPS, ఎస్పీ ఆసిఫాబాద్, అశోక్ కుమార్, IPS, డీసీపీ మంచిర్యాల, కుమార్ చింత, IPS, ఏడీ ఎస్పీ, గడ్చిరోలి (అడ్మిన్) , యతీష్ దేశ్‌ముఖ్, IPS, అదనపు ఎస్పీ. గడ్చిరోలి (ఆపరేషన్స్). M. రమేష్, IPS,అదనపు ఎస్పీ. అబే, వైభవ్ బంకర్, IPS, అదనపు ఎస్పీ. బీజాపూర్ (ఆపరేషన్స్), సందీప్ కుమార్ పటేల్, IPS,Addl. ఎస్పీ, భానుప్రతాపూర్ (కంకేర్). రాబిన్సన్ గురియా. IPS,Addl. SP నారాయ ణపూర్. తాజేశ్వర్ దివాన్, Dy.SP (OPS). మొహల్లా-మన్పూర్, అజీత్ ఓగ్రే, Dy.SP (OPS), రాజ్‌నంద్‌గావ్. సుబాస్ షిండే,SDPO, ధనోరా, విశాల్ నాగర్గోజే, Dy.SP (OPS), గడ్చిరోలి, రవీంద్ర భోసలే, SDPO, కుర్ఖెడ, సూరజ్ జగ్తాప్, SDPO, గడ్చిరోలి, జగదీష్ పాండే, SDPO, పెంధారి, చైతన్య కదం, SDPO, ఎటపల్లి, యోగేష్ రంజన్కర్, SDPO, హెదారి, అజయ్ కోకాటే, SDPO, అబేరి, అమ్మర్ మోహితే SDPO, భామ్రాగడ్, శశికాంత్ దుసుర్కర్, SDPO, జిమలగట్ట, సందేశ్ నాయక్, SDPO, సిరోంచ పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now