ఆ ఊరిలో మద్యం నిషేధం

Written by telangana jyothi

Published on:

ఆ ఊరిలో మద్యం నిషేధం

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలలోని గంగగూడెం ఊరిలో మందు నిషేధం. గత 30 ఏళ్లుగా మద్యపాన నిషేధం పాటిస్తూ పలు గ్రామా లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పచ్చని పొలాలు, ఊరి మధ్య నుండి పారే సెలయోరు, చక్కని పల్లె వాతావరణానికి నిలు వెత్తు ప్రతిరూపం ఆ గ్రామం. సుమారు దాదాపుగా 90 శాతం మంది మద్యానికి దూరంగా ఉంటున్నారు. వీరిలో ఈ మార్పు రావడానికి మహిళలు రోడ్డెక్కి నిరసనలు చేయలేదు. నిశ్శబ్ద విప్లవంతో కూడిన సత్యాగ్రహంతో గ్రామంలో మార్పు ను సాధించుకుని ఆదర్శ గ్రామంగా నిలిచారు. అయితే ఈ మార్పు అప్పటికప్పడు వచ్చింది కాదు, కొన్నిఏళ్ల శ్రమ దాగి ఉంది. ఒకప్పుడు గంగగుడెం గ్రామం అశాంతికి కేరాఫ్ అడ్రాస్ గా ఉండేది. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలు ఉండేవి. పోలీస్ ల నిఘానీడలో గ్రామం బిక్కుబిక్కు మంటూ ఉండేది. ఆ గ్రామంలో అశాంతికి ప్రధాన కారణం వీధికొకటిగా వెలసిన సారాయి దుకాణాలు. ఫుల్లుగా తాగిన మందుబాబుల ఆగ డాలకు అడ్డూ అదుపులేకుండా పోయేది. తాగడానికి డబ్బు లు లేకపోతే దోపిడీ, దొంగతనాలకు తెగబడేవారు. కాని ఇవన్నీ 30ఏళ్ల క్రితం నాటి మాట. గ్రామస్థులందరూ సాధిం చిన నిశ్శబ్ద విప్లవంతో గ్రామంలో సమూల మార్పులు జరిగా యి. ఏళ్లుగా పాటుగా గంగగుడెం గ్రామప్రజలు మద్యంపై సాదించిన యుద్ధంలో గ్రామస్థులదే పై చేయి అయ్యింది. మధ్యపానం రహిత గ్రామంగా గంగగుడెం గ్రామం పోలీస్, ఎక్సైజ్ రికార్డుల్లోకి చేర్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామంలో మందు దొరకక పోవడంతో 90 శాతం మంది మందుబాబులు మద్యానికి గుడ్ బై చెప్పేసారు. ఎవరైనా మద్యం తాగాలంటే పక్క గ్రామానికి వెళ్లాల్సిందే. గంగగుడెం గ్రామజనాభ సుమారు 300 మంది. ఒకప్పుడు సార,లిక్కర్ బెల్ట్ దుకాణాలకు కొదువే ఉండేది కాదు. నిత్యం త్రాగుడికి బానిసలైన భర్తలను చూసి వారిని మార్చాలని సంకల్పిం చారు మహిళలు. ఆ ఊరి పెద్దలు, యువత ఆ మహిళా సంకల్పానికి చేయూతనిచ్చారు. గ్రామంలో అశాంతికి సార మహమ్మారే కారణం అని అమ్మకం దారులను తమ అమ్మ కాలను నిలిపివేయాల్సిందిగా ప్రాధేయపడ్డారు. లాభాల కక్కు ర్తికి అలవాటు పడిన దళారులు లెక్కచేయలేదు. అలాగని మహిళలు వెనకడుగు వేయలేదు. మద్యం అరువు ఇవ్వ లేదని మహిళ గొంతుకోసేసిన సంఘటనలు ఎన్నో చూసి ఉంటాము, ఈ నేపథ్యంలో గ్రామ మహి మరింత చైతన్య పరిచింది.సార దుకాణదారులతో పలుమార్లు చర్చలు జరిపి నష్టాన్ని వివరించి దుకాణాలను మూసివేసేలా కదం తొక్కారు గంగగుడెం గ్రామ ప్రజలు. దీంతో ప్రవృత్తి మార్చు కుని కూరగా యల దుకాణాలను పెట్టుకున్నారు. మహిళా సంకల్ప బలం ఫలితంగా ప్రశాంతతకు మారుపేరుగా మారింది గంగగూడెం.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now