మండల వర్కింగ్ జర్నలిస్టు కమిటీ ఏర్పాటు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : సమాజంలో నెలకొ ని ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వారది గా పనిచేయడంలో వర్కింగ్ జర్నలిస్టు పాత్ర కీలక మైనదని ఏటూరునాగారం మండల వర్కింగ్ జర్నలిస్టు కమి టీ అధ్యక్షుడు ముండ్రాతి సాయికిరణ్ అన్నారు. శనివారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యలయం అవరణలో మండల వర్కింగ్ జర్నలిస్టులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఏటూరునాగారం మండల వర్కింగ్ జర్నలిస్టుల అధ్వర్యంలో నూతన మండల వర్కింగ్ జర్నలిస్టు కమిటీ ఏన్నికల ద్వారా ఏర్పాటు చేసు కోవడం జరిగింది. కాగా, వర్కింగ్ జర్నలిస్టుల అధ్వర్యంలో ఏన్నికల ప్రక్రియ ద్వారా మండల వర్కింగ్ జర్నలిస్టు కమిటీ అధ్యక్షు డుగా దిశ పత్రిక విలేకరి ముండ్రాతి సాయికిరణ్ ను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మాదరి సురేష్, ఉపాద్యక్షుడిగా భూక్య ఠాగూర్,ఏండీ హబీబ్ ఖాన్, సహయ కార్యదర్శిగా ఏండీ పాషా, తాటి నీలాద్రి, కోశా దికారిగా గుజ్జెటి శ్రావణ్ కూమార్, గౌరవ అధ్యక్షులుగా సాయిని శ్రీనివాస్, వల్స శ్రీనివాస్, గౌరవ సలహదారులుగా మెరుగు ప్రసాద్, అల్లం రమేష్, చిటమట గంగాదర్, రాంగోని ప్రమోద్, కార్యవర్గ సభ్యులుగా రాందేని శ్రీనివాస్, గోపాల్, యగ్గడి రవి, కొండా పవన్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్ర మంలో గుజ్జేటి రాజ శేఖర్, శివలింగ ప్రసాద్, నరేష్,ఈశ్వర్, రవిలు పాల్గొన్నారు.