అజాత శత్రువు శ్రీపాదరావు
– అధికారికంగా జయంతి వేడుకలు
– అంగరంగ వైభవంగా కాంగ్రెస్ శ్రేణుల సందడి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పేద ప్రజల ఆశాజ్యోతి, అజాతశత్రువు, మంథని పెద్దాయన, ఆపద్బాం ధవులు, స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాటారం మండల కేంద్రంలోని శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పూల దండలతో ఘనంగా నివాళులు అర్పించారు. అదే విధంగా కాటారం, మహాదేవపూర్, మహా ముత్తారం, పలి మల, మలహర్ మండలాలలో అన్ని ప్రభుత్వ అధికార కార్యాలయాలలో శ్రీపాద రావు 87వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. సీట్లు, పళ్ళు పంపిణీ చేసి ఆనందోత్సవాల మధ్య శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా పార్టీలకతీతంగా పలువురు నేతలు సైతం శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దుద్దిల్ల శ్రీపాద రావుతో అనుబంధం కలిగిన కుటుంబాలు, వారి సభ్యులు శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి సీనియర్ జర్నలిస్ట్ గాదె రమేష్ నేత తమ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. శ్రీపాదరావు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కన్నీటితో నివాళి అర్పించారు. శ్రీపాద రావు లేని లోటును ఎవరూ పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఇంటిల్లిపాదికి శ్రీపాదరావు దైవమని మేధావులు అభివర్ణించారు. విపక్ష నేతలకు సైతం, మంథని నియోజకవర్గ ప్రజలకు అజాతశత్రువుగా వర్ధిల్లిన శ్రీపాదరావు జయంతి వేడుకలు మంథని శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటా వేడుకలాగా జరిగాయి. కాటారం మండల కేంద్రంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఎంపీటీసీ జాడి మహేశ్వరి, పిసిసి మహిళా సెల్ కార్యదర్శి ఆంగోతు సుగుణ, మైనార్టీ సెల్ అధ్యక్షులు అమీర్ ఖాన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రమేష్, ఎంపీటీసీలు ఉడుముల విజయ రెడ్డి, మహేషు రవీందర్ రావు, అజ్మీర కృప ఓమ్ సింగ్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ గద్దె సమ్మిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చీమల వెంకటస్వామి, కోఆప్షన్ నెంబర్ అజీజ్, మేరాజ్, మాజీ ఎంపీటీసీలు కోసరి భాస్కర్, మాజీ సర్పంచ్ అజ్మీరా రఘురాం, ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు కొట్టే ప్రభాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొట్టే శ్రీహరి, యూత్ కాంగ్రెస్ మంథని డివిజన్ కార్యదర్శి కడారి విక్రమ్, మంత్రి నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్క ఉమా శంకర్, పసుల మొగిలి, కిరణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహేందర్, సుందిళ్ల ప్రభుదాస్, నాయకులు మంత్రి బాపు, కుమ్మరి రమేష్, చీర్ల మధుసూదన్, బీసుల నరసయ్య తదితరులు పాల్గొని శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేకు కట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కాటారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారికంగా ఎంపీడీవో ఆధ్వర్యంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య సమక్షంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు.