ఆదివాసీల ఆత్మ బంధువుకు ఘన నివాళులు అర్పించి న ఏజేఏసి
– పెసా చట్ట రూపకర్తను స్మరించుకున్న ఆదివాసీలు.
– పోరుబాట పడతామని ఆదివాసీ సంఘాల హెచ్చరిక.
– పాలకుల విధానాలతోనే ఆదివాసీల అభివృద్ధి లో అస్థిరత.
–ఏజెన్సీ సంపదను కొల్ల గొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
– వలస వాదులు ఏజెన్సీ వదిలి వెళ్లి పోవాలి
వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : భగవంతుడు సృష్టించిన భూమి, అడవికి, ఆదివాసీలకు మధ్యన సర్కార్ ఎవరని నిలదీసిన బ్రహ్మ దేవ్ శర్మ ఐ. ఏ. ఎస్. 9వ వర్ధంతి సభ ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వ ర్యంలో పూనెం ప్రతాప్ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్బంగా ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బీడీ శర్మ కు ఘన నివాళులు అర్పించారు. ఆదివాసీల ఆత్మ బంధువు, ఆదివాసీ హక్కుల గొంతుక బీడీ శర్మ అని ఆదివాసీ నాయకులు అన్నారు. బీడీ శర్మ ఆదివాసీల పక్షాన సుదీర్ఘ పోరాటం చేశారని అన్నారు. ఆదివాసీల స్వయం పాలన కోసం నాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆదివాసీల ఆత్మ బంధువును కోల్పోవడం బాధాకరం అన్నారు. మొట్ట మొదటి ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పని చేసి ఒక్క రూపాయి జీతం తీసుకున్న గొప్ప వ్యక్తి అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసే క్రమంలో ఎన్నో దాడులు రాజ్యం నుండి ఎదురు కున్నట్లు వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ సంపదను కొల్లగొడుతూ వారి ఉనికి లేకుండా చేస్తున్నారని, ఎన్నో ప్రజా పోరాటాలు చేశారని అన్నారు. దేశానికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆదివాసీలు స్వేచ్ఛ, స్వాతంత్రం కోల్పోయారని బీడీ శర్మ పదే పదే మాట్లాడి నట్టు నాయకులు గుర్తు చేశారు . బీడీ శర్మ కు ఆదివాసీ సమాజం ఎంతో రుణపడి ఉంద న్నారు. బీడీ శర్మ అడుగు జాడల్లో ఆదివాసీ సమాజం నడవాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పైన దమన కాండ కొనసాగిస్తూ ఏజెన్సీ సంపదను దోచుకుం టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంవత్సరాలుగా, అడవులను, సహజ సంపదను ఆదివాసీలు కాపాడితే అభి వృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాన్ని వల్లకాడుగా మారుస్తున్నా రని ఆదివాసీ సంఘాలు ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంత విచ్చి న్నానికి గిరిజనేతర రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీలను గ్రామాల నుండి బహిస్కరించాలన్నారు. ఆదివాసీ చట్టాల అమలు చేయాలని రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీల పేరుతో ఆదివాసీలను విడగొట్టి గిరిజన చట్టాలను అమలు కాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల కుట్రలు బయట పెట్టేందుకు ఆదివాసీ సంఘాలు త్వరలోనే ప్రజలు మధ్యకు వెళ్తునున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ళు ఆదివాసీలకు మాత్రమే కేటాయించాలన్నారు. రాజ్యాంగ విరు ద్ధంగా ప్రభుత్వం వలస గిరిజనేతరులకు ఇళ్ళు కేటాయిం చడం తో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రజా పాలన పేరుతో రేవంత్ రెడ్డి గిరిజన చట్టాలను తుంగలో తొక్కు తున్నట్లు మండిపడ్డారు. గిరిజన సలహా మండలి ఆమోదం లేకుండా షెడ్యూల్డ్ ప్రాంతం లో వలస గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే ప్రభుత్వం పైన పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఏ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఉయిక శంకర్, జి ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి సిద్దబోయిన సర్వేశ్వర్ రావు, జిల్లా నాయకులు కుచ్చింటి చిరంజీవి, జి ఎస్పీ జిల్లా అధ్యక్షులు రేగా గణేష్, కుంజ మహేష్, గోపి గోపినాధ్, మాంతయ్య, సికిందర్, తది తరులు పాల్గొన్నారు..