జంగాలపల్లి మినీ గురుకులంలో బాలికలకు అడ్మిషన్లు ప్రారంభం
వెంకటాపురం నూగురు, ఏప్రిల్ 19, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం జంగాలపల్లి మినీ గురుకుల బాలికల పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్ నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ జే. సుజాత తెలిపారు. ఆరు సంవత్సరాల బాలికలకు అవకాశం ఉండగా, 1వ తరగతిలో 30 సీట్లు, 2వ తరగతిలో 9 బ్యాక్లాగ్ సీట్లు, 3వ తరగతిలో 3, 4వ తరగతిలో 1, 5వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఏప్రిల్ 20 నుండి మే 5, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని, వాజేడు, వెంకటాపురం మండలాల విద్యార్థినులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎంపిక విధానం డ్రా ద్వారా జరుగుతుందని, ఎంపికైన వారికి ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు, దుస్తులు తదితర సౌకర్యాలు కల్పించబడతాయని పేర్కొన్నా రు. ఆసక్తి గల తల్లిదండ్రులు ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, నాలుగు ఫోటోలు తీసుకుని పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.









