తునికాకు బోనస్ డబ్బులకై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆదివాసీలు. 

తునికాకు బోనస్ డబ్బులకై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆదివాసీలు. 

  • కనికరించని ప్రభుత్వం, అధికారులు

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో అనేక గ్రామాల గిరిజనులకు తనికి ఆకు బోనస్ డబ్బులు వారి వారి అకౌంట్లో నేటీకి జమ కాక పోవటంతో తమ డబ్బులు విషయంపై ప్రతిరోజు, నిత్యం వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. కూలి,నాలి చేసుకొని జీవనం సాగించే గ్రామాల ఆదివాసీలు వేసవి లో ఉపాధి కల్పించే తునకాకు సీజన్ లో ఆకు సేకరించగా ప్రభుత్వపరంగా బోనస్ డబ్బులు నేటికీ చెల్లించకపోవడంతో, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకు కార్మికులకు కొంతమందికి .మాత్రమే బోనస్ డబ్బులు వారి వారి అకౌంట్లలో , 30% మంది కి మాత్రమే చెల్లింపులు జరిగాయని, మిగతా 70 శాతం మంది తమ పేర్లు ఏమయ్యాయి, గల్లంతయ్యాయ అని అకౌంట్ నెంబర్లు, కొనుగోలు పత్రాలు ఇతర ఆధారాలు అధికారులకు, కలేదార్లకు సమర్పించామని తెలిపారు. సంవత్సరాలు గడుస్తున్న తమ బోనస్ డబ్బులు జమ కావటం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో దూలాపురం, వాజేడు, వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా రేంజ్ కార్యాలయం పరిధిలో అనేక గ్రామాల గిరిజనులు నిత్యం కూలి పోగొట్టుకొని,ఆటో చార్జీలు తో పనులు పోగొట్టుకొని, వెంకటాపురం ఫారెస్ట్ కార్యాల చుట్టూ కాగితాలు పట్టుకుని తిరుగుతున్నారు. తిప్పాపురం, కలిపాక, కొత్తగుంపు ,వాడగూడెం ,బెస్తగూడెం , తోపాటు మురుమూరు, జల్లా కాలనీ, నూగూరు, బొల్లారం, ఇంకా అనేక గ్రామాల తునికి ఆకు కార్మికులు వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయానికి, ప్రతినిత్యం వచ్చి ఫారెస్టు అదికారులు ను కలసీ వెళ్తున్నారు. పిల్ల జల్లతో చెట్టు పుట్ట తిరిగి ఆకులు సేకరించి కట్టలు కట్టి, విక్రయించి వేసవి ఉపాధిగా పని చేసిన బోనస్ డబ్బులు విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్వవహరిస్తుందని ఎందుకు జమ చేయడం లేదని ఈ సందర్భంగా కార్మికులు ఫారెస్ట్ కార్యాలయం వద్ద ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై అధికారులపై శాపనార్ధాలు పెడుతూ దుమ్ము ఎత్తి పోస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల సమయం ఓట్ల కోసం మిడతల దండులా తిరిగే ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు తమ బోనస్ డబ్బులు విషయం పట్టీంచు కోవటం లేదని , ఓట్లు కావాలంటూ , తిరిగే వారికి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తునికి ఆకు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “తునికాకు బోనస్ డబ్బులకై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆదివాసీలు. ”

Leave a comment