బొమ్మనపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.  

బొమ్మనపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం వాజేడు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. వాజేడు పి.ఎస్. సివిల్ పోలీస్ ఎస్.ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులకు అనేక భద్రతా పరమైన అంశాల పాటు సైబర్ నేరాలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు గ్రామస్తులు ఆశ్రయం కల్పించవద్దని, అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు.గ్రామీణ యువత ఉద్యోగ, ఉపాధి విద్యా రంగాలలో ముందుకు సాగాలని, గ్రామస్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహనతో సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా అనేక బథ్రాతా అంశాలపై కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం లో ఎస్సై వెంకటేశ్వరరావు బొమ్మనపల్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాజేడు సివిల్ పోలీసులతో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “బొమ్మనపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.  ”

Leave a comment