జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్​ నర్సు, సిబ్బంది కొరత తీర్చండి

Written by telangana jyothi

Published on:

జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్​ నర్సు, సిబ్బంది కొరత తీర్చండి

– కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్​ యూనియన్​ జిల్లా అద్యక్షుడు రమేష్​

– మంత్రి సీతక్కకు వినతి

ములుగు : ములుగులోని జిల్లా ఆస్పత్రిలో సరైన స్టాప్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉన్న కొద్ది స్టాఫ్​ తో రోగులకు సరైన సేవలు అందించలేక పోతున్నామని తెలంగా ణ కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయీస్​ అసోసి యేషన్​ జిల్లా అధ్యక్షుడు గాదె రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు అసోసియేషన్​ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. 317జీవోతో జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న 11మంది స్టాఫ్​ నర్సులు, ఇతర సిబ్బంది బదిలీపై వెళ్లారన్నారు. జోన్ల పరిధిలోకి వెళ్లేసరికి జిల్లా ఆస్పత్రిలో వచ్చే రోగులకు సరైన సేవలు అందించలేక పోతున్నామ న్నారు. ప్రస్తుతం 10మంది కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది మాత్రమే ఉన్నారన్నారు. 75పడకల ఆస్పత్రిలో ఐసీయూ సేవలు కూడా కొనసాగుతున్నాయని, టీహబ్​, రేడియాలజీ హబ్​ లలో కూడా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీరోజు ఓపీ 400లమంది ఐపీకి 100మంది వస్తున్నార న్నారు. వైద్యులు, పారామెడికల్​ సిబ్బంది కొరతతో ఇబ్బం దులు పడుతున్నామని, సరైన సిబ్బందిని వెంటనే జిల్లా ఆస్పత్రికి అలాట్​ చేయాలని కోరారు. ములుగు నుంచి వెళ్లిన స్టాఫ్​ నర్సులను వెంటనే తిరిగి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో అసోసియేషన్​ సభ్యులు ఉన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now