వాజేడు మండలంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
– ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రజల సమస్యలు తెలుసు కోవ డానికి సోమవారం వచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మండల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజా ప్రభుత్వంలో మారుమూల ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ను మండల నాయకులు శాలువతో ఘణంగా సన్మానించారు. మండలం లోని చండ్రుపట్ల, టెకులగూడెం తదితర గ్రామాల్లో ఎం.ఎల్.ఎ .డాక్టర్ వెంకటరావు సుడిగాలి పర్యటన జరిపా రు. ఈ కార్యక్రమంలో అదికారులు, నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.