తాటి చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి.

Written by telangana jyothi

Published on:

తాటి చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి.

– మోకుదెబ్బ రమేష్ గౌడ్ డిమాండ్

తెలంగాణ జ్యోతి, నర్సంపేట : దుగ్గొండి మండలం పొనకల్ గ్రామంలో అక్రమంగా తాటి చెట్లు నరికిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట ఆబ్కారి సిఐ. నరేష్ రెడ్డి కి మోకుదెబ్బ ఆధ్వర్యం లో గురువారం పిర్యాదు చేశారు అనంతరం రమేష్ గౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల కులాలలో గౌడ కులస్తుల వృత్తి అత్యంత ప్రమాదకరమైనదన్నారు.నిరంతరం చస్తూ బతుకుతున్న గౌడ్ వృత్తి సంబంధమైన తాటి, ఈత చెట్లను అభివృద్ధి పేరుతో, రోడ్డు వెడల్పు, చెరువు కట్టల మరమ్మత్తుతో విచ్చల విడిగా నరికి వేస్తున్నారని ఆరోపిం చారు. అక్రమంగా తాటి చెట్లను నరికి వేస్తున్న వారిపై వెంటనే ఆప్కారి శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు ముఖ్య నాయకులు తదితరు లు పాల్గొన్నారు.

Leave a comment